Monday, December 23, 2024
spot_img
HomeArtలవకుశల గానాన్ని కళ్ళముందుంచిన ‘చిత్ర’కావ్యం .. చిత్రకారుడు సురేష్ కి చాగంటి ప్రశంస

లవకుశల గానాన్ని కళ్ళముందుంచిన ‘చిత్ర’కావ్యం .. చిత్రకారుడు సురేష్ కి చాగంటి ప్రశంస

ఆర్ట్ టైమ్స్, 25 అక్టోబర్, 2024 : ఒకరి మాట తారక మంత్రం.. ఇంకొకరి గీత సుందర రూపం.. వారిద్దరి ఆలోచనలకు ప్రతిరూపం లవకుశల గాన కావ్య చిత్రం. వారిరువురిలో ఒకరు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, మరొకరు ప్రముఖ తెలుగు చిత్రకారులు సురేష్ కడలి.  వారి మాట, గీత.. కాన్వాస్ పై ఆధ్యాత్మిక శోభను పరిమళింపజేస్తోంది. హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో శుక్రవారం ప్రారంభం కాబోతున్న శ్రీరామయణ ప్రవచన కార్యక్రమం కోసం చాగంటి కోటేశ్వరరావు సూచన మేరకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని రుస్తుంబాద గ్రామానికి చెందిన సురేష్ ఈ చిత్రాన్ని గీశారు. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో లవకుశలు రామాయణం గానం చేస్తున్నట్టుగా, శ్రీరామచంద్రుడు, సీతాదేవి దివి నుండి వీక్షిస్తూ తమ బిడ్డల గానాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా, పశుపక్షాదులు ఆ గానానికి పరవశించిపోతున్నట్టుగా అద్భుతంగా ఈ చిత్రాన్ని గీశారు.

కనులారా వీక్షించినట్టుంది.. చాగంటి

చాగంటితో చిత్రకారుడు సురేష్

సురేష్ గీసిన చిత్రాన్ని చూసి చాగంటి కూడా పరవశించిపోయారు. సురేష్ చిత్రరచన ప్రతిభను ప్రశంసిస్తూ, “సురేష్ గారు, అద్భుతంగా ఉందండి. నిజంగా రామాయణ కాలంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఋషులందరూ లవకుశల దగ్గర రామాయణ గానం వింటున్నది కనులారా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది” అని పేర్కొంటూ ఆశీర్వచనాలు అందించారు.

వాల్ సైజులో ఐదు రోజుల్లో

లవకుశల గాన కావ్య చిత్రం రూపకల్పన గురించి సురేష్ కడలి ‘ఆర్ట్ టైమ్స్’తో మాట్లాడుతూ, “సుమారు 15 రోజుల క్రితం చాగంటి కోటేశ్వరరావుగారు ఇంట్లో రామాయణంలోని ఈ సన్నివేశం వివరించారు. నేను వెంటనే అక్కడే పెన్సిల్ తో రఫ్ గా స్కెచ్ వేసి చూపించాను. ఇప్పటికిప్పుడే ఇంత వేగంగా బాగా వేశారని మెచ్చుకుని ఆ స్కెచ్ ఆయన తీసుకున్నారు. ఈ స్కెచ్ నేను సెల్ ఫొనులో ఫోటో తీసుకుని, మా ఇంటికి దగ్గర పెన్సిల్ స్కెచ్ పర్ఫెక్ట్ గా వేసి వాట్సాప్ లో పంపించాను. చాలా బాగుందని చెప్పారు. తారువాత వాల్ సైజు (12 x 14)లో అక్రిలిక్ మీడియంలో ఐదు రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశాను. నేను గీసిన చిత్రం చాగంటి గారి మెప్పు పొందడం, ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించబోతుండడం చాలా ఆనందంగా ఉంది” అని సురేష్  పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular