ఆర్ట్ టైమ్స్ : సాయి పల్లవి.. గ్లామరుతో పని లేకుండా కేవలం తన నటనతో లక్షలాదిమంది అభిమానులు సంపాదించుకున్న నటి. హీరోయిన్లని గ్లామర్ కోసమే తీసుకుంటారు అన్న అపవాదు ఉన్న సినీ ఇండస్ట్రీలో.. నటనకే గ్లామర్ తీసుకొచ్చి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న సాయి పల్లవి ఏం చెప్పినా యూత్ కి తారక మంత్రంగా పనిచేస్తుంది. మలయాళంలో ‘ప్రేమం’ చిత్రంలో మలర్ టీచరుగా భారతదేశ వ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది.
అటువంటి సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను అందంగా ఉన్నానని అబ్బాయిలు చెప్తే నమ్మనని, అమ్మాయిలు చెప్తేనే నమ్ముతానని చెప్పి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో సాయి పల్లవి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎందుకు మీరు అలా అంటున్నారు అని సాయిపల్లవిని అడిగితే, ‘’అబ్బాయిలకి ఏ అమ్మాయిని చూసినా అందంగానే కనిపిస్తుంది. అదే అమ్మాయిలకు అయితే ఎవరైనా అందంగా ఉన్నారు అని చెప్పడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. అందుకే అబ్బాయిలు చెప్తే నమ్మను. అమ్మాయిలు చెప్తే కచ్చితంగా నమ్ముతాను’’ అని చెప్పింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. కాగా, దీపావళికి రిలీజ్ కాబోతున్న తమిళ చిత్రం ‘అమరన్’లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇందులో ఆమెది నిజజీవిత పాత్ర కావడం విశేషం.