ఆర్ట్ టైమ్స్ : ‘చదరంగ వేటై’ చిత్రంతో హీరోగా పరిచయమైన తమిళ సినిమాటోగ్రాఫర్ నట్టి నటరాజన్ తన కెరీర్ లోనే తొలిసారిగా డ్యూయల్ రోలులో నటిస్తున్నారు. ఆ చిత్రమే ‘ఆండవన్ అవతారం’. చార్లెస్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘నంజుపురం’, ‘అళగు కుట్టి సెల్లం’, ‘సాలై’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన చార్లెస్.. తన సొంత సంస్థ లైట్ సౌండ్ & మ్యాజిక్‌పై ‘ఆండవన్ అవతారం’ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు రాఘవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కథానాయిక, ఇతర పాత్రల ఎంపిక జరుగుతోంది. ఈ నెల 9న చెన్నైలో పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభమైంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతోంది. కాగా, ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా చార్లెస్ అందిస్తున్నారు. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ, నవనీత్-రాఘవ్ సంగీతం, ప్రవీణ్ భాస్కర్ ఎడిటింగ్ బాధ్యతలు వహిస్తున్నారు.
‘ఆండవన్ అవతారం’లో నట్టి డ్యూయల్ రోల్
Trending Now