Monday, December 23, 2024
spot_img
HomeNewsస్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ నుండి విముక్తి.. కొత్త ‘ఏఐ’ టెక్నాలజీ ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్

స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ నుండి విముక్తి.. కొత్త ‘ఏఐ’ టెక్నాలజీ ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్

ఆర్ట్ టైమ్స్, అక్టోబర్ 2024 : మనం ఏదైనా పనిలో చాలా బిజీగా ఉంటాం. అప్పుడే మన ఫోనుకి కాల్ వస్తుంది. ఎవరో అనుకుని అంత బిజీలోనూ కాల్ అటెండ్ చేస్తాం. తీరా అది స్పామ్ కాల్ అని తెలిసి చిరాకు కలుగుతుంది.  లేదా స్పామ్ ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటాం. ఒకవేళ స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ రాకుండా ఉండాలంటే మనమే రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆ పరిజ్ఞానం కూడా లేని ఎంతో మంది స్పామ్ కాల్స్ బారిన పడుతూనే ఉంటారు. కానీ.. ఇకపై ఆ సమస్య ఉండబోదు. భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం దేశంలోనే తొలిసారి  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అదే AI- పవర్డ్ స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్‌. దీనితో ఎయిర్‌టెల్ కస్టమర్లు స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ నుండి పూర్తిగా విముక్తి పొందినట్లే అంటున్నారు భారతీ ఎయిర్‌టెల్ ప్రతినిధులు.

ఈ టెక్నాలజీ కస్టమర్‌ల నుండి ఎటువంటి రిక్వెస్ట్ లు అవసరం లేకుండానే అనుమానాస్పదమైన స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ లు మన ఫోనుకి రాకుండా అడ్డుకుంటుంది. డ్యూయల్-లేయర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ప్రతిరోజూ కోట్లాది కాల్స్, మెసేజ్‌లను ప్రాసెస్ చేసి, ఎయిర్‌టెల్ వినియోగదారులకు మెరుగైన భద్రతను అందిస్తుంది. ఎయిర్‌టెల్ డేటా సైంటిస్టులు ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ AI-ఆధారిత సొల్యూషన్ కాల్స్, ఎస్ఎంఎస్ లను “అనుమానాస్పద స్పామ్”గా గుర్తించడానికి, వర్గీకరించడానికి ప్రత్యేకమైన అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది.

భారతీ ఎయిర్‌టెల్ తమిళనాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరుణ్ విర్మణి

ఈ విషయమై భారతీ ఎయిర్‌టెల్ తమిళనాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరుణ్ విర్మణి మాట్లాడుతూ, “నేటి డిజిటల్ యుగంలో స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ లు కస్టమర్లకు ప్రధాన ఆందోళనగా మారాయి. దీనిని పరిష్కరించడానికి ఎయిర్‌టెల్ ఒక వినూత్న AI-ఆధారిత పరిష్కారాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు ఎటువంటి డౌన్‌లోడ్‌లు లేదా సెటప్ అవసరం లేకుండా దాని ప్రయోజనాలను పొందగలుగుతారు. ఎయిర్‌టెల్ తన కస్టమర్ల భద్రతను బలోపేతం చేయడంలో విశ్వసనీయ టెలికాం భాగస్వామిగా ఈ రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది” అని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular