Monday, December 23, 2024
spot_img
HomeCinemaచిన్నకథ ‘సినిమా’గా మారింది.. ముంబై ఫిలిం ఫెస్టివల్లో ప్రశంసలందుకుంది!

చిన్నకథ ‘సినిమా’గా మారింది.. ముంబై ఫిలిం ఫెస్టివల్లో ప్రశంసలందుకుంది!

ఆర్ట్ టైమ్స్, అక్టోబర్ 2024 : ఏ సినిమాకైనా కథ చాలా ముఖ్యం. కథ బాగుంటే నటీనటుల పాపులారిటీతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. అదే కథలో దమ్ము లేకుంటే ఎంత మంది స్టార్స్ ఉన్నా ఫలితం ఆశాజనకంగా ఉండదని ఎన్నో సినిమాలు నిరూపించాయి. అందుకే మంచి కథే కాదు, పాఠకులను కూడా మెప్పించిన కథని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తోంది ‘అంగమ్మాళ్’ చిత్ర బృందం.

‘కోడిత్తుని’ రచయిత పెరుమాళ్ మురుగన్

నిజానికి అదొక చిన్నకథ. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన ‘కోడిత్తుని’ చిరుకథనే ‘అంగమ్మాళ్’ సినిమాగా తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తుకున్న ఈ చిత్రం ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ (MAMI)లో ప్రశంసలందుకోవడం విశేషం. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ఫోకస్ సౌత్ ఆసియా విభాగం కింద ఈ చిత్రం అధికారికంగా ఎంపికైంది. పెరుమాళ్ రాసిన కథలో ‘కోడిత్తుని’కి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే సినిమాగా తీయడానికి ఈ కథని ఎంచుకున్నారు. విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎంజాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నటుడు, గాయకుడు ఫిరోజ్ రహీమ్, సినిమాటోగ్రాఫర్ అంజోయ్ శామ్యూల్ నిర్మించారు. అంజోయ్ శామ్యూల్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కూడా అందించారు. వర్ధమాన తారలు గీతా కైలాసం, శరణ్, భరణి, తెండ్రాల్ రఘునాథన్, ముల్లై అరసి, బేబీ యాస్మిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలందుకున్న ‘అంగమ్మాళ్’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

‘కోడిత్తుని’ కథేంటి?

తమిళనాడులో 90వ దశకం మధ్యలో ఒక మారుమూల గ్రామంలో నివసించే ఒక తల్లి కథ ఇది. నగరంలో చదువుకున్న ఆమె కొడుకు.. తన తల్లి రవికె లేకుండా చీర ధరించడం ఇబ్బందిగా భావిస్తాడు. ఆమె ఎప్పుడూ అలాగే దుస్తులు ధరిస్తుంది. ఆయితే ఆమె బిడ్డ తనకి కాబోయే అత్తమామల కోసం ఈ విషయంలో ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు, ఒక సాధారణ సమస్య అదుపు తప్పి జటిలమవుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే ‘అంగమ్మాళ్’ చిత్రంలో చూడొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular