ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024: హాలీవుడ్ లో రూపొందుతున్న మరొక ప్రతిష్టాత్మక చిత్రం ‘మైన్ క్రాఫ్ట్’ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. 2025 ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నట్టు బుధవారం అధికారికంగా వెల్లడించారు. హాలీవుడ్ తారలు జాక్ బ్లాక్, జాసన్ మోమోవా, కేట్ మెక్‌కిన్నన్, డేనియల్ బ్రూక్స్, జెన్నిఫర్ కూలిడ్జ్, ఎమ్మా మైయర్స్, జెమైన్ క్లెమెంట్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘నెపోలియన్ డైనమైట్’ డైరెక్టర్ జారెడ్ హెస్ దర్శకత్వం వహిస్తున్నారు. 2011 బాగా పాపులర్ అయిన ఒక వీడియో ఆధారంగా ‘మైన్ క్రాఫ్ట్’ తెరకెక్కుతుండడం విశేషం. విడదల తేదీతో పాటు బుధవారం ట్రైలర్ విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. కాగా, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ సహా పలు భారతీయ భాషల్లోనూ అనువదించి విడుదల చేయనున్నారు.
హాలీవుడ్ తెరపై వీడియో గేమ్!.. 2025 ఏప్రిల్ లో ‘మైన్ క్రాఫ్ట్’
Trending Now