ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024 : 124 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన మురుగప్ప గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రికల్ వెహికల్ బ్రాండ్ మోంట్రా ఎలక్ట్రిక్ చిన్న పరిమాణ వాణిజ్య వాహనాల విభాగంలో మరో వాహానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే మోంట్రా ఎలక్ట్రిక్ టివోల్ట్ ఈ-ఎస్సివీ. త్వరలోనే తమ మొదటి విద్యుత్ ఆధారిత చిన్న వాణిజ్య వాహనాన్ని (e-SCV) విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మోంట్రా ఎలక్ట్రిక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయమై టివోల్ట్ సిఈఓ సాజు నాయర్ మాట్లాడుతూ, “టివోల్ట్ పర్యావరణ సహిత వాహనాల తయారీపై తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. విద్యుత్ వాహనాల పరిశ్రమకు భారతదేశంలో డిమాండ్ పెరుగుతోందని, ఈ రంగంలో అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. మోంట్రా ఎలక్ట్రిక్ ప్రారంభం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని, కస్టమర్‌లకు, అలాగే తమ వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఆచరణాత్మకమైన, స్థిరమైన పరిష్కారాలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ప్రపంచ వాహన ప్రమాణాలకు అనుగుణంగా TIVOLT e-SCVని రూపొందించామని చెప్చిపారు. చిన్న వాణిజ్య వాహన పరిశ్రమలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా టివోల్ట్ ఉంటుందని, మార్కెట్ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అధునాతన సాంకేతికతతో కొత్త వాహనాన్ని తయారు చేస్తున్నామని, టివోల్ట్ భారత మార్కెట్లో చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని బలంగా నమ్ముతున్నట్లు సాజు నాయర్ పేర్కొన్నారు.
‘మోంట్రా’ నుండి కొత్త విద్యుత్ వాహనం.. త్వరలో రోడ్లపైకి
Trending Now