Tuesday, December 24, 2024
spot_img
HomeNewsతాగునీరు జరభద్రం..! వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులతో జాగ్రత్త.. ప్రజలకు వైద్యుల సూచన

తాగునీరు జరభద్రం..! వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులతో జాగ్రత్త.. ప్రజలకు వైద్యుల సూచన

ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024 : రుతుపవనాల ప్రభావంతో కొంతకాలంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో అతిసారం వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అధికంగా ప్రబలుతుంటాయి. అందువల్ల ప్రజలు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షపాతం పెరిగేకొద్దీ నీటి సరఫరా కలుషితమయ్యే అవకాశం ఎక్కువవుతుందని, ఆ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సురక్షితమైన త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని యురేకా ఫోర్బ్స్ R&D నిపుణులు, డాక్టర్ హేమ సాగర్ సూచించారు. బాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవుల వంటి వ్యాధికారకాలను అంతం చేయడానికి కాచి చల్లార్చిన నీటిని తాగమని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే వర్షాకాలంలో నీటిని కలుషితం చేసే పూర్తి స్థాయి టాక్సిన్‌లను అడ్డుకోవడానికి ఇది పూర్తి పరిష్కారం కాదంటున్నారు డాక్టర్ హేమ. ఈ విషయంపై డాక్టర్ మాట్లాడుతూ, వేడి చేయడం అనేది సూక్ష్మజీవులను తటస్థీకరించడంలో ప్రభావవంతంగా ఉంటుందని, అయితే హానికరమైన రసాయనాలు, భారీ లోహాలు లేదా సీసం, పాదరసం, పురుగుమందుల వంటి కరిగిన ఘనపదార్థాలను తొలగించదన్నారు. కాలక్రమేణా ఈ కలుషిత పదార్ధాలన్నీ శరీరంలో పేరుకుపోతాయి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ఆధునిక నీటి శుద్ధి యంత్రాలు సమగ్రమైన పరిష్కారాన్ని అందిస్తాయని, అధునాతన శుద్దీకరణ సాంకేతికత (UV RO) అనేక రకాల మలినాలను తొలగిస్తాయని చెప్పారు. ఆర్వో సాంకేతికత హానికరమైన రసాయనాలు, భారీ లోహాలను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుందని, తాగునీరు సురక్షితంగా ఉండటమే కాకుండా అత్యధిక నాణ్యతను అందిస్తుందని చెప్పారు.  కాబట్టి వర్షాకాలంలో కలుషిత రహిత నీటిని పొందేందుకు అధిక నాణ్యత గల వాటర్ ప్యూరిఫైయర్‌ల వాడకం ఉత్తమమని డాక్టర్ హేమ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం మార్కెట్లో ఆక్వాగార్డ్ సుపీరియో RO+UV టేస్ట్ అడ్జస్టర్ స్టెయిన్‌లెస్ స్టీల్ కాపర్ వాటర్ ప్యూరిఫైయర్ వంటి అధునాతన ప్యూరిఫైయర్లు అందుబాటులో ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular