Tuesday, December 24, 2024
spot_img
HomeBusinessసినిమా అనుభూతిని పంచే.. సోనీ కొత్త టీవీ ‘బ్రావియా 8 ఓఎల్ఈడీ’

సినిమా అనుభూతిని పంచే.. సోనీ కొత్త టీవీ ‘బ్రావియా 8 ఓఎల్ఈడీ’

ఆర్ట్ టైమ్స్, ఆగష్టు 2024 :  ఒకప్పుడు సినిమా చూడాలంటే ధియేటర్ ఒక్కటే మార్గం. కానీ ఇప్పుడు మన ఇంట్లోనే తీరిగ్గా కూర్చుని ధియేటర్ లో సినిమా అనుభూతిని కలిగించే ఆధునాత సాంకేతికత అందుబాటులోకి వచ్చేసింది. టీవీ తయారీ సంస్థలు కూడా మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సరికొత్త టీవీలను తయారు చేస్తున్నాయి. ఆ క్రమంలో ప్రముఖ టీవీ బ్రాండ్ సోనీ కొత్త టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. సోనీ టీవీ సీరీస్లో భాగంగా భారతదేశంలో ‘బ్రావియా 8 ఓఎల్ఈడీ’ని విడుదల చేసింది. 65-అంగుళాలు (164 సెం.మీ), 55-అంగుళాలు (139 సెం.మీ) పరిమాణాల్లో బ్రావియా 8 లభిస్తోంది. IMAX సాంకేతికతో కూడిన 4K ప్యానెల్‌, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం, AI ప్రాసెసర్ XR సాంకేతికత కూడా జోడించారు. దీనివల్ల స్క్రీన్ పై బొమ్మ స్పష్టంగా కనిపించడమే కాదు, సౌండ్ కూడా ధియేటర్లో సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుందని సోనీ ప్రతినిధులు తెలిపారు. కాగా, బ్రావియా 8 టీవీ సిరీస్ రెండు మోడల్స్ లో అందుబాటులో ఉంది. K-65XR80 మోడల్ ధర రూ. 314,990లు, K-55XR80 మోడల్ ధర రూ. 219,990లుగా నిర్ణయించారు. భారతదేశంలో ఉన్న అన్ని సోనీ సెంటర్‌లు, ప్రధాన ఎలక్ట్రానిక్ దుకాణాలు, ఇ-కామర్స్ పోర్టల్‌లలో ఈ టీవీలు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. సోనీ బ్రావియా 8 సిరీస్‌పై రెండేళ్ల వారంటీని కూడా అందిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular