Monday, December 23, 2024
spot_img
HomeArtబహు‘ముఖ’ చిత్రరాజం

బహు‘ముఖ’ చిత్రరాజం

ఆర్ట్ టైమ్స్, ఆగష్టు 24 : విభిన్న అంశాలు, శైలులు, సంస్కృతులు ఒకే చిత్రంలో ప్రతిబింబించేలా బహుముఖాలతో వినూత్నమైన చిత్ర సృష్టి ‘ఫ్యూజన్ ఆఫ్ ఫేసెస్’. కేరళ చిత్రకారుడు అజిమోన్ ఈ కళాత్మక ప్రక్రియను కాన్వాస్‌పై చక్కగా చిత్రించారు. యాక్రిలిక్ పెయింట్‌తో, విభిన్న బ్రష్ స్ట్రోక్ శైలులు ఉపయోగించి, పూర్తిగా ఫ్రీహ్యాండ్‌తో గీసిన చిత్రమిది. చిత్రాల పరిమాణం 12×16 అంగుళాలు. ఆయన వృత్తి రీత్యా ఇంటీరియర్ డిజైనర్ కూడా. ఒక ఇంటి ఇంటీరియర్‌ను పూర్తి చేయడానికి ఈ ఆర్ట్‌వర్క్‌ని డిజైన్ చేశారు. ఈ చిత్రాలు ఒక వ్యక్తి వయస్సులో వారి ముఖంలో సంభవించే వివిధ మార్పులను సూచిస్తుందని అజిమోన్ తెలిపారు. కాగా, దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి ఈ చిత్రాలు గీశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular