Monday, December 23, 2024
spot_img
HomeSportsటెన్నిస్ లాంటి ‘పడేల్’ ఆట.. భారతదేశంలో ప్రాచుర్యానికి పార్ధ్ జిందాల్ కృషి

టెన్నిస్ లాంటి ‘పడేల్’ ఆట.. భారతదేశంలో ప్రాచుర్యానికి పార్ధ్ జిందాల్ కృషి

పార్ధ్ జిందాల్, అతని మిత్ర బృందం

ఆర్ట్ టైమ్స్, ఆగష్టు 24 : ‘పడేల్’.. ఇదొక ఆట పేరు. కానీ ఈ మాట కూడా భారతదేశంలో చాలా మందికి తెలియకపోవచ్చు. పేరుకి తగ్గట్టుగానే ఈ ఆట కూడా ఏదో విచిత్రంగా ఉంటుందేమో అనుకునేరు. మనకి బాగా తెలిసిన టెన్నిస్ తరహాలోనే పడేల్ ఆడుతారు. కాకపోతే టెన్నిస్ ఓపెన్ కోర్టులో ఆడితే, పడేల్ నాలుగు వైపులా మూసి ఉన్న కోర్టులో ఆడుతారు. మెక్సికోలో పుట్టిన ఈ ఆట ఇప్పుడిప్పుడే భారత్ లో పరిచయమవుతోంది. నగరాల్లో ఓ మేరకు పడేల్ గురించి తెలిసినా, మిగతా ప్రాంతాలకు ఇది పూర్తిగా కొత్త. విదేశాల్లో ప్రాచుర్యమవుతున్న పడేల్ క్రీడని భారతీయులకి దగ్గర చేసేందుకు ముంబై కేంద్రంగా పని చేస్తున్న పడేల్ పార్క్ ఇండియా సంస్థ కృషి చేస్తోంది. ప్రస్తుతం ముంబైలో 11 పడేల్ కోర్టులు ఉండగా, మరో 22 కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు.  రాబోయే రోజుల్కాలో దేశవ్యాప్తంగా ఈ కోర్టులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకు జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ అండ్ ఇన్స్పైర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సపోర్ట్ (ఐఐఎస్) వ్యవస్థాపకులు పార్ధ్ జిందాల్ నేతృత్వంలోని బృందం నిధి సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయమై పార్ధ్ జిందాల్ మాట్లాడుతూ, భారతదేశాన్ని క్రీడా దేశంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని, పడేల్ పార్క్ ఇండియా సంస్థ దేశంలో పడేల్ క్రీడకు ప్రాచుర్యం కల్పిస్తోందని, అందుకు తమ వంతు సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రీడకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు, శిక్షణ, ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడం, టోర్నమెంట్ల నిర్వహణ వంటివి ఈ సంస్థ చేపడుతోందని చెప్పారు. పడేల్ అంతర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడ అని, భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడ అవుతుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. భారతదేశంలో ఈ క్రీడకు ఆదరణను పెంచడానికి పడేల్‌పార్క్ బృందంతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని జిందాల్ అన్నారు. పడేల్‌పార్క్ సహ వ్యవస్థాపకులు రోనాక్ డాఫ్టరి స్పందిస్తూ, పడేల్‌ క్రీడను ప్రమోట్ చేసేందుకు పార్ధ్ జిందాల్, అతని బృందం ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని, వారి విజన్ భారతదేశంలో పడేల్‌ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కాగా, పడేల్‌పార్క్ రాబోయే మూడు నెలల్లో 40 కోర్టులు, రెండు నెలల్లో 15 పడేల్‌ క్లబ్ లను ప్రారంభించనుండడంతో పాటు, 250 మందికి పైగా క్రీడాకారులకి శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. అంతేకాదు, ఈ నెలలోనే భారత్ లో 90కి పైగా జట్లు పాల్గొనే భారీ పడేల్‌ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular