Tuesday, December 24, 2024
spot_img
HomeBusinessడిజిటల్ బ్యాంకింగ్‌లో ‘ఎస్ బ్యాంక్’ ఆధిపత్యం.. UPI చెల్లింపులలో అగ్రస్థానం

డిజిటల్ బ్యాంకింగ్‌లో ‘ఎస్ బ్యాంక్’ ఆధిపత్యం.. UPI చెల్లింపులలో అగ్రస్థానం

ఆర్ట్ టైమ్స్, ఆగష్టు 23 : భారతదేశంలోని ప్రముఖ ప్రైవేటురంగ బ్యాంకులలో ఒకటి అయిన యస్ బ్యాంక్ UPI చెల్లింపులలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా డిజిటల్ బ్యాంకింగ్ లో మరోసారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 53.3% మార్కెట్ వాటా, 99.8% సక్సెస్ రేటుతో దేశవ్యాప్తంగా కోట్లాది మంద వినియోగదారులు, వ్యాపారులకు యస్ బ్యాంక్ ప్రధాన ఎంపికగా కొనసాగుతోంది. భారతదేశంలో జరిగే ప్రతి మూడు డిజిటల్ లావాదేవీలలో ఒకటి తమ బ్యాంకుదేనని ఈ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ విజయానికి సాంకేతిక ఆవిష్కరణలను వినియోగదారులకు చేరువ చేయడంలో ఎస్ బ్యాంక్ దృఢ నిబద్ధత కారణంగా ఎస్ బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్ (DLP) 2.0 చిన్న వ్యాపారాల ఫైనాన్స్‌ను యాక్సెస్ చేయడాన్ని గతంలో కంటే సులభతరం చేసిందని, ముఖ్యంగా ఆర్ధిక భద్రత కూడా కల్పిస్తోందని తెలిపింది. వ్యాపారులకు వేగవంతమైన, సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన లావాదేవీలను అందించడమే తమ లక్ష్యమని, ఆన్‌లైన్ షాపింగ్, బిల్లులు చెల్లించడం లేదా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు డబ్బు పంపడం వంటి ఎతివంటి లావాదేవీలకు అయినా సరే YES BANK UPI ప్లాట్‌ఫారమ్ నగదు భద్రతను నిర్ధారిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, రూపే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా UPI చెల్లింపులను ప్రవేశపెట్టిన ఘనత ఎస్ బ్యాంకుకే చెందుతుంది. దీని ద్వారా వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి UPI లావాదేవీలు చేయవచ్చు. ఈ సేవలు ప్రారంభించినప్పటి నుండి YES బ్యాంక్ 4 లక్షలకు పైగా UPI ఆధారిత క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular