ఆర్ట్ టైమ్స్, ఆగస్టు 21, 2024: సరిగ్గా అయిదేళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సీక్వెల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి పార్ట్ అద్భుత విజయాన్ని సాధించడంతో.. ఆ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన ‘ముఫాసా’ పేరుతో రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ పేరుతో డిసెంబర్ 20, 2024న విడుదల కాబోతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్‌ని అందిస్తుండడం విశేషం. టైటిల్ రోల్ ముఫాసాకి మహేష్ వాయిస్ ఇస్తున్నారు. అలాగే బ్రహ్మానందం పుంబాగా, అలీ టిమోన్‌గా మళ్ళీ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి పార్టులో మరో తెలుగు హీరో నాని వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండో పార్టుకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తుండడంతో ‘ముఫాసా’ క్రేజ్ తెలుగులో అనూహ్యంగా పెరిగింది. కాగా, తెలుగు వెర్షన్ ట్రైలర్ ను ఆగస్టు 26, 2024న విడుదల చేయబోతున్నారు.
సింహానికి మహేష్ బాబు వాయిస్.. తెలుగులో ‘ముఫాసా’ క్రేజ్
Trending Now