Monday, December 23, 2024
spot_img
HomeCinema'మైనా', 'పిజ్జా' చిత్రాల వరుసలో 'పేచ్చి' – ఆడియో వేడుకలో చిత్ర యూనిట్

‘మైనా’, ‘పిజ్జా’ చిత్రాల వరుసలో ‘పేచ్చి’ – ఆడియో వేడుకలో చిత్ర యూనిట్

ఆర్ట్ టైమ్స్, జూన్ 23 : తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న ‘మైనా’, ‘పిజ్జా’ చిత్రాల తరహాలో ‘పేచ్చి’ కూడా జనరంజకంగా ఉంటుందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది ఆ చిత్ర బృందం పేర్కొంది. తమిళ నూతన దర్శకుడు రామచంద్రన్ పి. దర్శకత్వంలో వేలోన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గోకుల్ బినయ్, వెరూస్ ప్రొడక్షన్స్‌ షేక్ ముజీబ్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘పేచ్చి’. రాజేష్ మురుగేషన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను బుధవారం చెన్నైలో విడుదల చేశారు. బాల శరవణన్, గాయత్రి శంకర్, దేవ్, మురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్టు 2న థియేటర్లలోకి రానుంది. చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఆడియో వేడుకలో నటుడు మురళీరామ్‌ మాట్లాడుతూ, ‘తమిళ చిత్రసీమలో బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచిన ‘మైనా’, ‘పిజ్జా’ వంటి చిత్రాల తరహాలో మా సినిమా కూడా ఉంటుంది. ఆ సినిమాలన్నీ స్నేహితుల కోసం తీసినవే. ఆ వరుసలో ‘పేచ్చి’ కూడా చోటు దక్కించుకుంటుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు తమ సొంత సినిమాలా పనిచేశారు” అని చెప్పారు. దర్శకుడు రామచంద్రన్ మాట్లాడుతూ, ఈ చిత్రం సాంకేతికంగా కొత్త అనుభూతిని కలిగిస్తుందని,  ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు చెప్పారు. కాగా, హారర్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి  పార్తిబన్ సినిమాటోగ్రఫీ, అశ్విన్ ఎడిటింగ్ బాధ్యతలు చెప్పారు. కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular