Tuesday, December 24, 2024
spot_img
HomeBusinessగ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర ఉత్పత్తుల పెట్టుబడులకు సరైన సయమమిది - జీసిపీఎల్ ఎండీ

గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర ఉత్పత్తుల పెట్టుబడులకు సరైన సయమమిది – జీసిపీఎల్ ఎండీ

ఆర్ట్ టైమ్స్, జూలై 23 : అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో గ్రామీణ భారతంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త, గోద్రెజ్ కంజ్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (జీసిపిఎల్) ఎండి, సిఈఓ  సుధీర్ సీతాపతి పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేత్పత్తుల పెట్టుబడులకు ఇది సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామీణ మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, వేగంగా విక్రయమయ్యే వస్తువుల తయారీ, విక్రయ సంస్థలైన FMCG కంపెనీలు గ్రామీణ మార్కెట్లలో ఆహారేతర ఉత్పత్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని అన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధిని గుర్తించిందని, పల్లెల్లో కూడా ఖర్చులు పెరిగాయని, ఆహారేతర వస్తువుల కొనుగోలుపై వినియోగదారుల్లో చెప్పుకోదగ్గ మార్పుని గమనించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మార్పు FMCG సంస్థలు దేశవ్యాప్తంగా తమ వ్యాపారాలను విస్తరించడానికి అపూర్వమైన అవకాశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, విద్యుదీకరణ, డిజిటల్ ఇండియా కార్యక్రమాల విజయం వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. మారుమూల, సుదూర ప్రాంతాలకు చేరుకోవడం సులభతరంగా మారిన నేపధ్యంలో గ్రామాల్లో పెట్టుబడులకు వెసులుబాటు కలుగుతోందన్నారు. పెట్టుబడుల్లో భాగంగా బిజినెస్ అవుట్‌లెట్‌లు, ప్రత్యక్ష పంపిణీ, వినియోగదారులకు ప్రోత్సాహకాలను అందించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా FMCG సంస్థలు తమ వ్యాపార ప్రణాలికలు రూపొందిచుకోవాలని పిలుపునిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాంక్షలను నెరవేర్చడానికి సవాళ్లను అధిగమిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నంలో GCPL కృషి చేస్తోందని సుధీర్ సీతారాం పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular