ఆర్ట్ టైమ్స్ : డైనోసార్ల ప్రపంచాన్ని సిల్వన్ స్క్రీన్ పై ఆవిష్కరించి యావత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన జురాసిక్ పార్క్ సిరీస్ లో మరో కొత్త చిత్రం ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డైనోసార్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది ‘జురాసిక్ పార్క్’. ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ అలరించింది. 1993లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొత్త చరిత్ర సృష్టించింది. సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఎన్నో వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైనోసార్స్ తిరిగి భూమి మీదకు వస్తే ఏం జరుగుతుందనే కాన్సెప్ట్‌తో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ ఈ మూవీ తెరకెక్కించగా.. ఆ తర్వాత ఈ సిరీస్ లో పలు సినిమాలు వచ్చాయి. తాజాగా.. ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ మరోసారి డైనోసార్లప్రపంచాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అప్పట్లో హాలీవుడ్ సినిమాలై అంతగా తెలియని తెలుగు ప్రేక్షలుకు ఆడియన్స్ సైతం ‘జురాసిక్ పార్క్’కి ఫిదా అయిపోయారు. దాంతో హాలీవుడ్ లోనే కాకుండా భారతదేశంలోనూ ఈ చిత్రాలకి అసంఖ్యాకమైన అభిమానులు ఉన్నారు. వారి కోసం ఇంగ్లీష్ తో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

30 సంవత్సరాలకు పైగా ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్న ఈ చిత్రానికి గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. గ్లోబల్ సూపర్‌స్టార్ స్కార్లెట్ జాన్సన్, ఎమ్మీ నామినీ జోనాథన్ బెయిలీ, రెండుసార్లు ఆస్కార్ అందుకున్న మహర్షాలా అలీ, ఇంకా రూపర్ట్ ఫ్రెండ్, మాన్యువల్ గార్సియా-రుల్ఫో తదితరులు ఈ చిత్రంలో నటించారు. కథ విషయానికొస్తే, జురాసిక్ పార్క్ ఉన్న ప్రదేశంలో ఒక పాడుబడిన ద్వీపానికి ఒక బృందం భారీ మిషన్ పై వెళతారు. అక్కడ, వారు భయంకరమైన నరమాంసభక్షులను ఎదుర్కోవడమే కాకుండా.. ఊహకందని ప్రమాదాలు ఎదురవుతాయి. అక్కడ జురాసిక్ రీ బర్త్ అసలు కథ మొదలవుతుంది.



