Saturday, April 26, 2025
spot_img
HomeCinema6 రోజులు ముందే వస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్’

6 రోజులు ముందే వస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’

ఆర్ట్ టైమ్స్: హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’.. ప్రకటించిన తేదీకి ఆరు రోజులు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో వస్తున్న 8వ భాగమిది. పారామౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్ టామ్ క్రూజ్ ప్రొడక్షన్‌ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం భారతీయ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం పారామౌంట్ పిక్చర్స్ ఇండియా ఇంగ్లిషుతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణనంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2025, మే 23వ తేదీన విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థలు ఇంతకుముందు ప్రకటించాయి. అయితే తాజాగా షెడ్యూల్ కంటే 6 రోజుల ముందుగానే మే 17న ఈ సినిమా 2025, శనివారం థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. దీంతో ఈ ఐకానిక్ ఫ్రాంచైజీ అభిమానులు ఈథన్ హంట్ (టామ్ క్రూస్)ను సిల్వర్ పెద్ద స్క్రీన్‌పై చూడటానికి మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తారనడంలో సందేహం లేదు.  అయితే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో ఇదే ఆఖరి భాగం కావడం బాధాకరం.  క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించిన “మిషన్: ఇంపాసిబుల్ – ది ఫైనల్ రెకనింగ్” చిత్రంలో టామ్ క్రూస్ తో పాటు హాలీవుడ్ తారలు హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, ఎసై మోరల్స్, పోమ్ క్లెమెంటిఫ్, హెన్రీ క్జెర్నీ, ఏంజెలా బాసెట్, హోల్ట్ మెక్‌కాలనీ, జానెట్ మెక్‌టీర్, నిక్ ఆఫర్‌మాన్, హన్నా వాడింగ్‌హామ్, ట్రామెల్ టిల్‌మాన్ తదితరులు నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ఒక సన్నివేశాన్ని తాజ్ మహల్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular