ఆర్ట్ టైమ్స్, నవంబర్ 17, 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గ్రేడ్ 1 జిల్లా ప్రభుత్వ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న గ్రంధాలయ వారోత్సవాలలో సీనియర్ చిత్రకారులు చిదంబరం రావు గీసిన చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వారోత్సవాలలో కళాకారులకు భాగస్వామ్యం కల్పిస్తూ వివిధ కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వాటిలో భాగంగా ఆదివారం చిత్రకళా ప్రదర్శన జరిగింది. విద్యార్ధి వికాస్ వాహిని వ్యవస్థాపకులు కేశవరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రదర్శనలో ఉంచిన చిత్రాలను, చిదంబరం కళాత్మక దృష్టిని కొనియాడారు. ఆ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ, “సమాజ హితమే లక్ష్యంగా స్ఫూర్తివంతమైన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది నా ఆకాంక్ష. చిత్ర కళ ద్వారా సమాజంలో మార్పు కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను” అని పేర్కొన్నారు.
సమాజ హితమే లక్ష్యం.. గ్రంథాలయ వారోత్సవాలలో చిత్ర ప్రదర్శన
Trending Now