ఆర్ట్ టైమ్స్ : తన్వీర్ దయానంద యోగి జన్మదిన వేడుకలలో భాగంగా ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే ‘దైవీక అద్భుతాలు మరియు రహస్యాలు’ (డివైన్ మిరాకిల్స్ అండ్ సీక్రెట్స్) పుస్తకం రెండవ భాగాన్ని విడుదల చేశారు. అలాగే ‘యోగా – పార్ట్ 1’ పుస్తకాన్ని, ‘సుగ జ్ఞానానందం’ అనే సంగీత ఆల్బమ్ లను కూడా విడుదల చేశారు. ఇందుకు చెన్నై నగరంలోని ఒక స్టార్ హోటల్ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ.నజీరుల్ అమీన్, ప్రముఖ సినీ నటుడు రామకృష్ణ, ప్రముఖ ప్యానెల్ స్పీకర్ బులావర్ రామలింగం ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఇంకా సినీ, పారిశ్రామిక, క్రీడలు, వ్యవసాయం రంగాలకు చెందినవారు, సామాజిక కార్యకర్తలు కూడా పాల్గొనగా, ఈ కార్యక్రమానికి విజయ్ టీవీ ఫేమ్ కె.పి.వై. బాల, ‘కుక్ విత్ క్లౌన్’ ఫేమ్ మణిమేఘలై వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆ సందర్భంగా తన్వీర్ దయానంద యోగి ఆధ్యాత్మిక సేవలు గురించి అతిథులు కొనియాడారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన కలిగించే రచనలు, పుస్తకాలు మరిన్ని వెలువడాలని వారు ఆకాంక్షించారు.




