ఆర్ట్ టైమ్స్, మార్చి 2025 : చిత్ర కళా రంగానికి ఎనలేని సేవలందిస్తోన్న సీనియర్ చిత్రకారులు, చిత్రకళా విశ్లేషకులు, రచయిత, విమర్శకులు సుంకర చలపతిరావుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళా రత్న’ పురస్కారాన్ని ప్రకటించింది. ఈనెల 30వ తేదీన విజయవాడలోని తుమ్మపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకల్లో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. సుంకర చలపతిరావుకి రాష్ట్ర ప్రభుత్వం ‘కళా రత్న’ ప్రకటించడం పట్ల తెలుగు చిత్రకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గౌరవం సుంకరకి ఎప్పుడో దక్కాల్సిందని, ఆలస్యమైనా ఆయనకి ‘కళా రత్న’ ఇవ్వడం ఆ పురస్కారానికే గౌరవమని పలువురు చిత్రకారులు వ్యాఖ్యానించారు. విశాఖ వాసి అయిన సుంకర చలపతిరావుకి ఉమ్మడి తెలుగు రాష్ట్రలలోని సీనియర్ చిత్రకారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యువ చిత్రకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు. కాగా, ‘కళా రత్న’ పురస్కారం క్రింద 50 వేల నగదు, హంస ప్రతిమ, శాలువా, ప్రశంసా పత్రం అందజేస్తారు.
సుంకర చలపతిరావుకి ‘కళా రత్న’.. ఉగాది పురస్కారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. 30న విజయవాడలో ప్రదానం
Trending Now