ఆర్ట్ టైమ్స్, మార్చి 11, 2025: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన గాయకులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూయడంపై చిత్ర కళారంగం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాట్రేనికోనకు చెందిన అంజి ఆకొండి సహా పలువురు చిత్రకారులు గరిమెళ్ళకి నివాళులు అర్పించారు. గరిమెళ్ల మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1978 నుండి 2006 వరకు టిటిడిలో ఆస్థాన గాయకుడిగా సేవలు అందించిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 600 లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. సంప్రదాయ కర్ణాటక, జానపద, లలిత సంగీతంలోనూ ప్రావీణ్యత కలిగిన ఆయన.. తుదిశ్వాస వరకు శ్రీవారి సేవలో తరించారు.
గరిమెళ్ళకు ‘చిత్ర’ నివాళి
Trending Now