ఆర్ట్ టైమ్స్ (ఫిబ్రవరి 23, 2025) : ‘లబ్బర్ బంతు’ భారీ విజయం తర్వాత ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాణంలో, ఎ. వెంకటేష్ సహ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. ఆర్య, గౌతమ్ కార్తీక్ హీరోలు. సీనియర్ నటుడు శరత్ కుమార్, మలయాళ తార మంజు వారియర్, కాళి వెంకట్ ముఖ్య పాత్రలు పోషించగా.. అనక, అతుల్య రవి, రైజా విల్సన్ హీరోయిన్ రోల్స్ పోషించారు. ‘ఎఫ్ఐఆర్’ చిత్రంతో సత్తా చాటుకున్నా యువ దర్శకుడు మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తిబు నినాన్ సంగీతం సమకూర్చగా, అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, ప్రసన్న ఎడిటింగ్‌ను బాధ్యతలు చేపడుతున్నారు. 1965లో హిమాలయాలలో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘మిష్టర్ ఎక్స్’ టీజర్, తొలి పాటను శనివార్మ నిన్న సాయంత్రం చెన్నైలోని విజయ మాల్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఆర్య మాట్లాడుతూ, “ఈ కథ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. కథని నమ్మి ఈ సినిమా చేశాము. దర్శకుడు మను ఆనంద్ ప్రతి సన్నివేశాన్ని ముందస్తు ప్రణాళికతో చక్కాగా చిత్రీకరించాడు. ఈ సినిమా కోసం ముంబైలో నీటి అడుగున ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాము.

కోలీవుడ్ హల్క్ ఆర్య.. సినిమాలో రెండో హీరో గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ, “ఈ సినిమా నేను ఊహించిన దానికంటే గోప్ప్గా వచ్చింది. యాక్షన్ దృశ్యాలు ప్రేక్షులాలని గగుర్పాటుకి గురిచేసేలా ఉంటాయి. సిల్వ మాస్టర్ యాక్షన్ సన్నివేశాలను చాలా ప్రత్యేకమైన రీతిలో రూపొందించారు. ఇక పోతే, ఆర్యతో కలిసి నటించడం నాకు చాలా ఆననడంగా ఉంది. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుండి నేను అమితంగా అభిమానించే నటుడు ఆర్య. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆర్య నాకు హల్క్ లాగా కనిపించాడు. తన శరీరాన్ని అంత ఫిట్ గా ఉంచుకుంటాడు. తూత్తుకుడిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు కూడా, ఆర్య తాను బస చేసిన చోటు నుండి బయటకు వచ్చి అక్కడి వారిని జిమ్ ఎక్కడ ఉందని అని అడిగాడు. ఫిట్నెస్ కి అంతటి ప్రాముఖ్యత ఇస్తాడు. ఆర్య నాకు ఒక రోల్ మోడల్” అన్నారు.
వైవిధ్యమైన సినిమా.. నటి మంజు వారియర్ మాట్లాడుతూ, “మిస్టర్ ఎక్స్ ఒక వైవిధ్యమైన సినిమా. ఈ సినిమా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. చిత్రీకరణ సమయంలో పలు కఠినమైన సవాళ్లు ఎదురైనప్పటికీ, వాటన్నింటినీ ఎదుర్కొని సినిమాను పూర్తి చేయడంలో సిబ్బంది చాలా సహకరించారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు మాకు కలిగిన ఉత్సాహం.. రేపు థియేటర్లలో సినిమా చూసే అభిమానులకు కూడా కలుగుతుంది ” అని అన్నారు.