Monday, April 7, 2025
spot_img
HomeBusinessదక్షిణాదికి ‘పుల్‌మాన్’.. చెన్నైలో కొత్త హోటల్ & రిసార్ట్

దక్షిణాదికి ‘పుల్‌మాన్’.. చెన్నైలో కొత్త హోటల్ & రిసార్ట్

ఆర్ట్ టైమ్స్ (ఫిబ్రవరి 21, 2025) : ఆతిథ్య రంగంలో అంతర్జాతీయంగా పేరుగాంచిన ‘పుల్‌మాన్’ హోటల్స్ అండ్ రిసార్ట్స్ దక్షిణ భారతదేశంలో అడుగు పెట్టింది. చెన్నై నగరంలోని ప్రధాన ప్రాంతమైన అన్నాసాలై లో నిర్మించిన ఈ హోటల్ ను ఇటీవలే ప్రారంభించారు. ఈ రంగంలో 150 ఏళ్ళ చరిత్ర కలిగిన పుల్‌మాన్ భారతదేశ ప్రజలకు ఆతిథ్యం అందించేందుకు సిద్ధమైంది. చెన్నైలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన అన్నాసాలైలో నెలకొన్న ఈ హోటల్.. ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, కాన్సులేట్‌లు, కార్పొరేట్ హబ్‌లు, వ్యాపార సంస్థలకు అనుసంధానంగా ఉంటుంది. 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన 232 గదులు, విశాలమైన ఈవెంట్ వేదికలు తదితరాల సౌకర్యాలతో ఈ హోటల్ ను నిర్మించారు. కార్పొరేట్ ఈవెంట్‌లు, సమావేశాలు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, బిల్డింగ్ డిజైన్, కన్స్ట్రక్షన్ విభాగంలో లీడర్‌షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్ (LEED) ప్రోగ్రామ్ కింద ప్రతిష్టాత్మకమైన గోల్డ్-లెవల్ సస్టైనబిలిటీ సర్టిఫికేషన్ కూడా పొందింది. కాగా, హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అకార్ ఆసియా ప్రీమియం, మిడ్‌స్కేల్ & ఎకానమీ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గార్త్ సిమ్మన్స్, హోటల్ యజమాని, డెవలపర్ అయిన సీబ్రోస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular