Thursday, April 3, 2025
spot_img
HomeCinemaరివ్యూ : కెప్టెన్ అమెరికా – బ్రేవ్ న్యూ వరల్డ్

రివ్యూ : కెప్టెన్ అమెరికా – బ్రేవ్ న్యూ వరల్డ్

ఆర్ట్ టైమ్స్ : ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులు అమితంగా ఇష్టపడే సినిమాలలో మార్వెల్ స్టూడియో నిర్మించే ‘అవెంజర్స్’ సిరీస్ కూడా ఒకటి. ఆ సిరీస్ లో భాగంగా కెప్టెన్ అమెరికా ప్రధాన పాత్రలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం నుండి కెప్టెన్ అమెరికా, రెడ్ హల్క్ మధ్య పోరాటాల గురించిన వార్తలు వైరల్ గా మారాయి. దీంతో ఈ ఇద్దరు సూపర్ హీరోల అభిమానులు ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ నెల 14న హాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ తదితర భారతీయ భాషల్లోనూ ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. నిజానికి హాలీవుడ్‌లోనే కాకుండా ఇండియాలోనూ కెప్టెన్ అమెరికా సిరీస్‌లకు అభిమానులు భారీగా ఉన్నారు. ఐరన్ మ్యాన్ వర్సెస్ థోర్ నుండి హల్క్ వరకు MCUలో అనేక సూపర్ హీరో యాక్షన్ చిత్రాలు వచ్చాయి.

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా, అభిమానులకు ఇష్టమైన కామిక్ పాత్రలను వెండితెరపైకి తీసుకువచ్చి సరికొత్త చరిత్ర సృష్టించింది మార్వెల్ సంస్థ. అంచనాకు అందని ఊహాగానాలతో కెప్టెన్ అమెరికా సిరీస్ లో కొత్త కొత్త యాక్షన్ కథలను మనకి అందిస్తున్నారు. అందులో భాగమే ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’. కథ విషయానికొస్తే, అమెరికా అధ్యక్షుడు థాడియస్ రాస్‌ను కలిసిన తర్వాత సామ్ ఒక అంతర్జాతీయ కుట్రలో చిక్కుకుంటాడు. ఆ కుట్రకు నిజమైన సూత్రధారి ప్రపంచాన్ని నాశనం చేసేలోపు, అతను ఆ కుట్ర వెనుక ఉన్న కారణాన్ని కనిపెట్టాలి. ఊహించినట్టుగానే యాక్షన్ దృశ్యాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. అయితే కథలో సత్తా లేకపోవడంతో గత సినిమాల స్థాయిలో అనిపించదు. జూలియస్ ఓనా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంథోని మాకీ, డానీ రామిరేజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular