Friday, April 4, 2025
spot_img
HomeNewsవిజయంతో తిరిగి రండి.. తమిళ అథ్లెట్లకు ఒలింపిక్ సంఘం పిలుపు.. క్రీడా పరికరాలు పంపిణీ  

విజయంతో తిరిగి రండి.. తమిళ అథ్లెట్లకు ఒలింపిక్ సంఘం పిలుపు.. క్రీడా పరికరాలు పంపిణీ  

ఆర్ట్ టైమ్స్, జనవరి 2025 : ఉత్తరాఖండ్‌లో జరుగనున్న 38వ జాతీయ క్రీడల్లో తమిళనాడు రాష్ట్రం నుండి 393 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరుగనున్న పోటీల్లో 31 విభాగాల్లో అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. 102 మంది అధికారుల బృందంతో సహా మొత్తం 495 మంది తమిళనాడు నుండి ఉత్తరాఖండ్ వెళ్తున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అథ్లెట్లకు తమిళనాడు రాష్ట్ర ఒలింపిక్ సంఘం క్రీడా పరికరాలు, సామగ్రిని పంపిణీ చేసి, ఘనంగా వీడ్కోలు పలికారు. అధ్యక్షుడు ఐసరి గణేష్, ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున, కోశాధికారి సెంథిల్ త్యాగరాజన్, SDAT జనరల్ మేనేజర్ సుజాత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అథ్లెట్ల కవాతుకు అధికారిక జెర్సీని ఆవిష్కరించారు.  ఆ సందర్భంగా ఐసరి గణేష్ మాట్లాడుతూ, జాతీయ క్రీడల్లో తమిళ అథ్లెట్లు విజయ దుందుభి మోగించాలని, పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular