ఆర్ట్ టైమ్స్ : రెండున్నర శతాబ్దాల క్రితం యావత్ సినీ లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేసిన హాలీవుడ్ చిత్రం ‘గ్లాడియేటర్’. ప్రపంచ సినీ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఈ చిత్రానికి భారతదేశంలోనూ విపరీతమైన అభిమానులు ఉన్నారు. పురాతన రోమ్ సామ్రాజ్యాన్ని, నాటి నిరంకుశ చక్రవర్తుల ఆగడాలును, వారిపై యోధుల పోరాటాలను కళ్ళకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారు దర్శకుడు రిడ్లీ స్కాట్. 2000 సంవత్సరంలో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ‘గ్లాడియేటర్’కి కొనసాగింపుగా పారామౌంట్ పిక్చర్స్ నిర్మించిన ‘గ్లాడియేటర్ 2’ నవంబర్ 15న విడుదల కాబోతుంది. మొదటి భాగానికి ఏమాత్రం తీసిపోకుండా భారీ బడ్జెట్ తో రెండో భాగాన్ని తెరకెక్కించినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. దాదాపు 2500 కోట్లు వ్యయం చేసినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైకాం 18 స్టూడియోస్ సంస్థ ఇండియాలో ఇంగ్లిష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారే ఎత్తున రిలీజ్ చేస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రీమియర్ వేయగా, సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 4డీఎక్స్తో పాటు ఐమాక్స్ వెర్షన్లోనూ ‘గ్లాడియేటర్ 2’ రిలీజ్ చేస్తున్నారు.
మరో లెవెల్లో విజువల్స్ ..
‘గ్లాడియేటర్-2’ ట్రైలర్లోని విజువల్స్, యుద్ధ సన్నివేశాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. తనను బంధీని చేసిన రోమ్ చక్రవర్తులపై మాక్రిసన్తో కలిసి లూసియస్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది ఈ సినిమాలో దర్శకుడు రిడ్లీ స్కాట్ చూపించబోతున్నారు. యాక్షన్ సన్నివేశాలతో పాటు రోమ్ సామ్రాజ్యంలో జరిగిన కుట్రలు, కుతంత్రాలు, రోమ్ చక్రవర్తిపై లూసియస్ ప్రతీకార దృశ్యాలు మరో లెవల్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. కాగా, ‘గ్లాడియేటర్ 2’లో చక్రవర్తి గ్రెటాగా జోసెఫ్ క్విన్, చక్రవర్తి కారా కల్లాగా ఫ్రెడ్ హెచింగర్, డెరెక్ జాకోబి, కొన్నీ నీల్సన్ తదితరులు నటించారు. జాన్ మాథిసన్ సినిమాటోగ్రఫీ, హ్యారీ గ్రెగ్సన్ విలియమ్స్ సంగీతం సమకూర్చారు.