ఆర్ట్ టైమ్స్ : ఆంధ్ర ప్రదేశ్ డా. బి.ఆర్.ఏ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోనకు చెందిన తెలుగు చిత్రకారులు అంజి ఆకొండి స్థాపించిన క్రియేటివ్ హార్ట్స్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో దూర విద్య ద్వారా చిత్ర కళ (ఫైన్ ఆర్ట్స్) విభాగంలో డిప్లొమా కోర్సు అందిస్తున్నారు. ఆరున్నర దశాబ్దాలుగా భారతీయ సాంప్రదాయ కళల ప్రచారం, సంరక్షణ, వ్యాప్తికి కృషి చేస్తున్న దేశంలోని పురాతన, ప్రతిష్టాత్మకమైన సంస్థలలో ఒకటైన చండీఘర్ లోని ప్రాచీన్ కళా కేంద్ర అనుబంధంగా క్రియేటివ్ హార్ట్స్ పని చేస్తోంది. బొమ్మలు వేయడంలో నైపుణ్యం కలిగి, తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలనుకునే ఔత్సాహిక, వర్ధమాన చిత్ర కళాకారులు, బాలబాలికల కోసం ప్రత్యేకంగా దూరవిద్య ద్వారా ఈ ఫైన్ ఆర్ట్స్ కోర్సు నిర్వహిస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ కోర్సులో చేరవచ్చు. సిలబస్ ను అకాడమీ సమకూరుస్తుంది. కోర్సులో భాగంగా థియరీ, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇస్తారు. అలాగే వివిధ రకాల హస్త నైపుణ్య కళలపై శిక్షణకు క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ లో సర్టిఫికెట్ కోర్స్ నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు 9989325790 నంబరులో సంప్రదించవచ్చు.
ప్రాచీన కళా కేంద్ర ‘ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా కోర్సు’.. దరఖాస్తులు ఆహ్వానం
Trending Now
RELATED ARTICLES