ఆర్ట్ టైమ్స్, నవంబర్ 2024 : అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఏఈ, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, నేపాల్ తదితర దేశాల్లోని సంగీత ప్రేమికులని అలరించిన భారతీయ గాయకుడు-గేయ రచయిత ప్రతీక్ కుహద్ ఇప్పుడు భారత సంగీతాభిమానులను ముగ్ధుల్ని చేసేందుకు సిద్ధమయ్యారు. ‘సిల్హౌట్స్ టూర్-2024’ పేరుతో దేశవ్యాప్తంగా పది ప్రధాన నగరాల్లో సంగీత కచేరీలు నిర్వహించబోతున్నారు. ఇందులో తొలి కచేరీని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు. ప్రతీక్ కుహద్ సంగీత ప్రదర్శన భాగ్యనగర వాసులను విశేషంగా అలరించింది. సిల్హౌట్ అంటే భిన్నమైన రీతిలో జరిపే సంగీత కచేరీ. ఈ కార్యక్రమంలో సంగీతాభిమానులు సరికొత్త అనుభూతిని పొందుతారని నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, ఈ కచేరిలో నీడకి ప్రత్యేకమైన స్థానం ఉండడం విశేషం.
సిల్హౌట్స్ టూర్ లో భాగంగా శనివారం బెంగళూరు (భారతీయ సిటీ)లో, 15న ముంబై (సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం)లో, 16న పూణే (మే ఫీల్డ్ ఇవా గార్డెన్)లో, 23న గురుగ్రామ్ (ఐరియా మాల్)లో, 24న జైపూర్ (జీ స్టూడియోస్)లో, డిసెంబర్ 14న కలకత్తా (అక్వాటికా)లో, 15న గౌహతి (టిబిసి)లో, 19న లక్నో (రేపెర్వార్ ఫెస్టివల్)లో, 21న ఇండోర్ (ది పార్క్)లో, 22న అహ్మదాబాద్ (సవన్నా పార్టీ లాన్)లో ప్రతీక్ కుహద్ సంగీత కచేరీలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే సంగీత ప్రియులు టిక్కెట్ల కోసం బుక్ మై షో, prateekkuhad.com/tour వెబ్ సైట్లలో సంప్రదించవచ్చు అని నిర్వాహకులు తెలిపారు.