ఆర్ట్ టైమ్స్, చెన్నై (అక్టోబర్, 2024): ఐకాన్ స్టార్.. ఈ బిరుదుకి సినీ పరిశ్రమలో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఏ రంగంలో అయినా విశేషమైన సేవలందించిన లేదా విలక్షణ శైలితో ప్రత్యేకత చాటుకుంటున్న వారిని ‘ఐకాన్’గా కీర్తిస్తుంటారు. ఆ కోవలోనే జువెలరీ ఇండస్ట్రీకి చేస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ వజ్ర, బంగారు ఆభరణాల విక్రయ సంస్థ కీర్తిలాల్స్ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్‌ను ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసి) “ఐకాన్ ఆఫ్ జ్యువెలరీ ఇండస్ట్రీ 2024” బిరుదుతో సత్కరించింది. జీజేసి ఆధ్వర్యంలో ముంబైలోని జియో కన్వెన్షన్ ట్రేడ్ సెంటర్‌లో గురువారం జరిగిన ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ షోలో భాగమైన ఐకానిక్ ఈవెంట్ GJS Niteలో భాగంగా ఈ పురస్కారానని ప్రదానం చేశారు. రత్నాలు, ఆభరణాల రంగానికి సూరజ్ శాంతకుమార్ చేసిన విశేష సేవలకుగాను సూరజ్ శాంతకుమార్‌కు ‘ఐకాన్’ బిరుదును ప్రదానం చేశారు. దీంతోపాటు నేషనల్ జ్యువెలరీ అవార్డ్స్ 2024లో కీర్తిలాల్స్ మరో నాలుగు ప్రధాన అవార్డులను కూడా పొందింది. దక్షిణ భారతదేశానికి సంబంధించి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కీర్తిలాల్స్ షోరూమ్ కి ‘స్టోర్ ఆఫ్ ది ఇయర్‘ అవార్డు, రింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, థీమ్-ఆధారిత ఉత్తమ ఆభరణాలు అవార్డు, బ్రైడల్ జ్యువెలరీ ఆఫ్ ది ఇయర్ (కలర్ స్టోన్) అవార్డులను కీర్తిలాల్స్ సొంతం చేసుకుంది.
అవార్డులను అందుకున్న సందర్భంగా కీర్తిలాల్స్ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ మాట్లాడుతూ, “ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC)చే గుర్తించబడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డులు, ప్రశంసలు అన్నీ కీర్తిలాల్స్ కుటుంబం అంకితభావం, నైపుణ్యం, అభిరుచికి నిదర్శనం. నాణ్యత విషయంలో అత్యున్నత ప్రమాణాలను కొనసాగిస్తూ, ఆభరణ రంగంలో మరింత సృజనాత్మకను ప్రదర్శించడానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాం” అని పేర్కొన్నారు.