Monday, December 23, 2024
spot_img
HomeNewsయువతకి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ‘ముత్తూట్ మైక్రోఫిన్’ జాబ్ మేళా

యువతకి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ‘ముత్తూట్ మైక్రోఫిన్’ జాబ్ మేళా

ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024 :  భారతదేశంలోని మైక్రోఫైనాన్స్ సంస్థల్లో ఒకటైన ముత్తూట్ మైక్రోఫిన్ దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 ప్రదేశాలలో ప్రత్యేక జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. నిరుద్యోగ రేటుని తగ్గించడం, యువతకి ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. స్థానిక, గ్రామీణ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది. బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌ తదితర ప్రధాన రాష్ట్రాల్లో ఉద్యోగ మేళాలను విజయవంతంగా నిర్వహించింది. వేలాది మంది అభ్యర్ధులు పాల్గొని, ప్రత్యక్ష నియామకాలను పొందారు. ఇప్పుడు రిలేషన్షిప్ ఆఫీసర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్లు, బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్లతో సహా వివిధ పోస్టులకు 1500 మందికి పైగా నియమించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ అవకాశాలను తాజా గ్రాడ్యుయేట్లు, అనుభవజ్ఞులైన నిపుణులతో పాటు గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఇవ్వనుంది. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజున నియామక పత్రాలు కూడా అందజేయనున్నారు. ఈ విషయమై ముత్తూట్ మైక్రోఫిన్ సిఈఓ సతాబ్ సయీద్ మాట్లాడుతూ, “ఈ జాబ్ మేళా కేవలం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మాత్రమే కాదు. గ్రామీణ భారత సాధికారత మా మిషన్‌ లక్ష్యం” అని చెప్పారు. కాగా, ముత్తూట్ మైక్రోఫిన్ సెప్టెంబరు నెలలో తమిళనాడులో జాబ్ మేళాలను నిర్వహించింది. తిరుపూర్, పుదుకోట్టై, ఈరోడ్, మనప్పారై, తిరువారూర్, చెంగల్పట్టు, తిరునెల్వేలి, తిరువణ్ణామలై, అరియలూర్, వడలూరు, విరుదునగర్, నాగర్‌కోయిల్‌లలో ఇప్పటికే జాబ్ మేళాలు నిర్వహించింది. రాబోయే నెలల్లో ఈ ఉపాధి కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలలోనూ నిర్వహించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular