Monday, December 23, 2024
spot_img
HomeCinema‘లబ్బర్ బంతు’ కోసం బౌలింగ్ నేర్చుకున్న యంగ్ హీరో

‘లబ్బర్ బంతు’ కోసం బౌలింగ్ నేర్చుకున్న యంగ్ హీరో

ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024 : క్రీడల నేపథ్యంతో భారతీయ సినీ పరిశ్రమలో అనేక చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో చాలావరకు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నవే. ఆ వరుసలో తాజాగా తమిళంలో మరో క్రీడా నేపథ్య చిత్రం ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. యువ హీరో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించిన ఆ చిత్రమే ‘లబ్బర్ బంతు’. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. క్రీడా నేపథ్యంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ‘లబ్బర్ బంతు’ ఈ నెల 20న విడుదలవుతోంది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ‘అట్టకత్తి’ దినేష్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ‘వదంతి’ ఫేమ్ సంజన, స్వాసిక విజయ్ హీరోయిన్లు. కాళీ వెంకట్, దేవదర్శిని, బాలశరవణన్, డీఎస్కే తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నటించడం కోసం హరీష్ కళ్యాణ్ ప్రత్యేకంగా బౌలింగ్ నేర్చుకోవడం విశేషం. నిజానికి హరీష్ క్రికెట్ ఆడుతాడు. అయితే బ్యాటింగ్, కీపింగ్ మాత్రమే చేసేవాడు. ‘లబ్బర్ బంతు’ కథ కోసం ఎంతో కష్టపడి బౌలింగ్ నేర్చుకున్నాడు. ఆ అనుభవాలని హరీష్ కళ్యాణ్ మీడియాతో పంచుకుంటూ.. “కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఇప్పటివరకు నేను ఎక్కువగా సిటీ బాయ్‌గానే కనిపించాను.  అందుకే పల్లెటూరి పాత్రలు చేయాలనే కోరిక ఉంది. అలాగే క్రీడలకు సంబంధించిన సినిమాలో నటించాలనే ఆశ కూడా మరోవైపు ఉండేది. ఇవి రెండూ ఈ సినిమాలో ఉండడం నాకు లభించిన బహుమతిగా భావిస్తాను. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేవాడిని. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ చేసేవాడిని. కానీ ఈ సినిమాలో నేను బౌలింగ్ ఆల్ రౌండర్ పాత్ర పోషిస్తున్నాను. అందుకే శిక్షణ తీసుకున్నాను. చాలా మంది అంతర్జాతీయ క్రీడాకారుల బౌలింగ్ శైలిని గమనించాను. ఇకపోతే ఇప్పటి వరకు నేను నటించిన ఏ సినిమాలోనూ ఇలాంటి లుక్‌లో కనిపించలేదు. ఇది స్పోర్ట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమాలో సందేశం ఏమీ లేదు. అయినా సమాజానికి అవసరమైన మంచి విషయాలు ఈ సినిమాలో ఉంటాయి” అని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular