ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024 : ప్రైవేటు రవాణా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాపిడో అడుగులు వేస్తోంది. ఓలా, ఉబర్ లకు ధీటుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు రవాణా సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ-ఫండింగ్ విధానంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందుకోసం పెట్టుబడుల సంస్థ వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నేతృత్వంలోని సిరీస్ ఈ-ఫండింగ్ ద్వారా 200 మిలియన్ల డాలర్లను సేకరించింది. ఈ తాజా పెట్టుబడితో రాపిడో పోస్ట్-మనీ వాల్యుయేషన్‌ను 1.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. కొత్తగా సేకరించిన నిధులను భారతదేశం అంతటా రాపిడో కార్యకలాపాలను విస్తరించడానికి వినియోగిస్తామని రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంకా తెలిపారు. కొత్త మూలధనం ద్వారా తమ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఫోర్-వీలర్ టాక్సీ సర్వీస్‌ను విస్తరించడానికి ఈ నిధులను ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు.
ఓలా, ఉబర్ కు ధీటుగా రాపిడో! విస్తరణకు భారీగా పెట్టుబడులు
Trending Now