ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024 : నాలుగు దశాబ్దాలుగా భారతీయ పెయింట్స్ పరిశ్రమలో రాణిస్తున్న అక్జోనోబెల్ సంస్థ డ్యూలక్స్ వెల్వెట్ టచ్ శ్రేణిలో మరో కొత్త రకం పెయింట్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. . అక్జోనోబెల్ ఇండియా మొదటి ఉబెర్-లగ్జరీ ఇంటీరియర్ ఎమల్షన్ ‘డ్యూలక్స్ వెల్వెట్ టచ్ ఎటర్నా‘ను విడుదల చేసింది. డ్యూలక్స్ వెల్వెట్ టచ్ ఎటర్నా పెయింట్ డ్యూలక్స్ వెల్వెట్ టచ్ శ్రేణిలోని అసమానమైన ఆవిష్కరణగా పేర్కొంటూ, ఇది అత్యుత్తమ నాణ్యత కలిగి ఉంటుందని అక్జోనోబెల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. భారతీయ ఇంటీరియర్ ఎమల్షన్‌లలో మొదటిసారిగా పరిచయం చేయబడిన అధునాతన PU రీన్‌ఫోర్స్డ్ యాక్రిలిక్ పెయింట్ ఇది. మరింత మన్నిక, దుమ్ము ధూళిని తట్టుకునే సామర్ధ్యం కలిగి ఉండడమే కాకుండా, గోడలు సహజమైన, శాశ్వతమైన అందాన్ని కలిగి ఉంటాయని అందులో పేర్కొన్నారు. దీని గురించి అక్జోనోబెల్ ఇండియా డెకరేటివ్ పెయింట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ తోట్లా మాట్లాడుతూ, “భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌లలో ఒకటిగా ఉన్న అక్జోనోబెల్ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ డ్యూలక్స్ వెల్వెట్ టచ్ పెయింట్స్ లో అత్యున్నత నాణ్యతతో తీసుకొస్తున్న మరో నూతన ఆవిష్కరణే డ్యూలక్స్ వెల్వెట్ టచ్ ఎటర్నా. ప్రతి బ్రష్‌స్ట్రోక్ లోనూ శాశ్వతమైన చక్కదనం, శుద్ధీకరణకు అద్దం పడుతుంది. డులక్స్ కలర్ ఎక్స్‌పర్ట్‌లు ఎటర్నల్ లవ్, ఎటర్నల్ ఫైర్, ఎటర్నల్ కాస్మోస్ వంటి 10 థీమ్‌లతో డ్యూలక్స్ వెల్వెట్ టచ్ ఎటర్నా కోసం ప్రత్యేకమైన ‘ఎటర్నల్స్’ సేకరణను రూపొందించారు. నాణ్యత విషయంలో అక్జోనోబెల్ ఎన్నడూ రాజీపడబోదు. ప్రజలు ఆందోళన లేని పెయింట్ అనుభవాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాము” అని చెప్పారు.
ఇంటీరియర్ గోడలకు మరింత అందాన్నిచ్చే ‘వెల్వెట్ టచ్ ఎటర్నా’
Trending Now