Monday, December 23, 2024
spot_img
HomeNewsసాయం చేసే సామాన్యులని గౌరవిద్దాం.. అమృతాంజన్ వినూత్న ప్రచారం

సాయం చేసే సామాన్యులని గౌరవిద్దాం.. అమృతాంజన్ వినూత్న ప్రచారం

ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024 : కొన్ని దశాబ్దాలుగా నొప్పిని మాయం చేయడంలో సగటు మనిషి విశ్వసనీయ ఔషధంగా ఉన్న అమృతాంజన్ హెల్త్ కేర్ సంస్థ ఒక వినూత్న ప్రచారానికి తెరలేపింది. మన సమాజంలో ప్రతి రోజూ ఎందరో ఎన్నో మంచి పనులు చేయడం చూస్తుంటాం. పెద్ద సాయం అయితే అభినందనలు వెతుక్కుంటూ వస్తాయి. అదే చిన్న చిన్న సాయాలని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అటువంటి వారిని గౌరవించే లక్ష్యంతో అమృతాంజన్ కొత్త ప్రచారం చేపడుతోంది. నిస్వార్థంగా ఇతరుల జీవితాల్లో మార్పు కోసం తపించేవారికి సమున్నత గౌరవం దక్కాలని, మంచి మనసుతో సాయం చేస్తూ ఎవరినీ తెలియని రోజువారీ ఛాంపియన్లను గుర్తించి  గౌరవించాలన్నదే తమ అభిమతమని  అమృతాంజన్ పేర్కొంది.

ఈ విషయమై అమృతాంజన్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ శంభు ప్రసాద్ మాట్లాడుతూ, “ప్రతిరోజు సాధారణ ప్రజలు ఎంతో మంది నిస్వార్ధంగా తోటి మనుషులకి సాయం చేస్తుంటారు. కానీ వారిలో ఎంతోమంది మన సమాజంలో పేరులేని హీరోలుగా మిగిలిపోతున్నారు. అమృతంజన్ హెల్త్ కేర్ ఒక శతాబ్దానికి పైగా ఆరోగ్యం, సంరక్షణ రంగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా ఉంది. మేము కేవలం ఉత్పత్తులను అందించడమే కాకుండా.. మానవ సంబంధాలకీ ఎంతో ప్రాముఖ్యత ఇస్తాము. ప్రజల నిస్వార్థత మాకు స్ఫూర్తినిస్తుంది. వారు ఈ ఉదారమైన పనులు కొనసాగించడంలో వారికి సహాయపడటానికి మేము కూడా కట్టుబడి ఉన్నాము. ఇందుకోసమే ‘దర్ద్ హమ్ సంభాల్ లెంగే” అనే థీంతో మేము ఒక కొత్త ప్రచారం చేపడుతున్నాం’ అని చెప్పారు.  అమృతంజన్ హెల్త్‌కేర్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మణి భగవతీశ్వరన్ మాట్లాడుతూ, “మా కొత్త ప్రచారం ఉద్దేశ్యం ప్రజలకు నొప్పి లేని, చురుకైన జీవితం అందించడం, ఇతరులకు సహాయం చేయడానికి ముందుకొస్తున్న నిస్వార్థ యోధులను గౌరవించడం” అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular