ఆర్ట్ టైమ్స్, సెప్టెంబర్ 2024: చెన్నై నగరంలో ఇటీవల జరిగిన కాస్మోటిక్స్ ఇంగ్రీడియంట్స్ ప్రదర్శనలో గెలాక్సీ సర్ఫాక్టాంట్స్ (Galaxy Surfactants) సౌందర్య సంరక్షణకై సరికొత్త పరిష్కారాలతో వినూత్న ఆవిష్కరణలు పరిచయం చేసింది. తమ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, అలాగే కొత్త వినియోగదారులను ఆకర్షించే విధంగా.. ఎక్స్ పోలో కొత్త ఉత్పత్తుల గురించి తెలియజేసింది. అలాగే గృహ సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులను కూడా పరిచయం చేసింది. ఆ సందర్భంగా గెలాక్సీ సర్ఫాక్టాంట్స్ బిజినెస్ క్రియేషన్ వైస్ ప్రెసిడెంట్ యోగేష్ కల్రా మాట్లాడుతూ, “వినియోగదారుల అవసరాలు, అభిరుచులను దృష్టిలో పెట్టుకుని వివిధ కాస్మోటిక్స్ ఉత్పత్తులను తయారు చేస్తున్నామని, అలాగే వినియోగదారుల పల్స్‌ని అర్థం చేసుకోవడానికి, ఈ రంగంలో రాణించడానికి వారికి వినూత్న పరిష్కారాలను అందించడానికి ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు.
సౌందర్య సంరక్షణకు.. ‘గెలాక్సీ’ వినూత్న ఆవిష్కరణలు
Trending Now