ఆర్ట్ టైమ్స్, ఆగస్టు 29, 2024: భారత ఆర్ధిక రాజధానిగా పేరుగాంచిన ముంబై నగరంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ (జిఎఫ్‌ఎఫ్) 2024 వేదికపై భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నూతన సాంకేతికతో కూడిన రెండు కొత్త డిజిటల్ పేమెంట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టారు. అవి భారత్ బిల్ పే (బీబీపీఎస్), యుపిఐ సర్కిల్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) వీటిని రూపొందించింది. భారత్ బిల్‌పే వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా, వివిధ ERP, అకౌంటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో బిజినెస్-టు-బిజినెస్ (B2B) లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడగా, UPI సర్కిల్ వినియోగదారులకు డెలిగేట్ చెల్లింపుల అందిస్తుంది. భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ భద్రత, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచేందుకు ఇవి రెండూ దోహదపడతాయని ఎన్‌పిసిఐ పేర్కొంది. ఫిన్‌టెక్ ఫెస్టివల్లో ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఎన్‌పిసిఐ సలహాదారు నందన్ నీలేకని, ఎన్‌పిసిఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి సమక్షంలో వీటిని ఆవిష్కరించారు.
డిజిటల్ పేమెంట్ లో కొత్తగా భారత్ బిల్ పే, యూపీఐ సర్కిల్.. ప్రవేశపెట్టిన ఆర్బీఐ గవర్నర్
Trending Now