ఆర్ట్ టైమ్స్, ఆగస్టు 21, 2024: రోడ్డు భద్రతపై యువతకు అవగాహన కల్పించడం వల్ల భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా (HMSI) దృఢంగా విశ్వసిస్తోంది. ఇందుకోసం భారతదేశ వ్యాప్తంగా రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు ప్రాంతంలో తాజాగా రోడ్డు భద్రత అవగాహన ప్రచారం చేపట్టారు. అక్కడ ధర్మమూర్తి రావు బహదూర్ కలవల కన్నన్ చెట్టి హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్ధులు, సిబ్బంది ఈ ప్రచారంలో పాల్గొన్నారు. సుమారు 2500 మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ప్రమాద అంచనా శిక్షణ, రహదారి భద్రత క్విజ్‌లు, హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు, ఇంకా రైడింగ్ ట్రైనర్ సెషన్ తదితర అంశాలు ఈ ప్రచారంలో ఉన్నాయి. పిల్లలు మరియు యువత లక్ష్యంగా జీవితకాలం పాటు ఉండే బాధ్యతాయుతమైన రోడ్డు వినియోగ అలవాట్లను పెంపొందించడం తమ లక్ష్యమని, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలను భాగాస్వామ్యులని చేస్తూ తరచుగా రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా తెలిపింది.
ప్రమాదాల నివారణే లక్ష్యంగా.. రోడ్డు భద్రతపై యువతకు అవగాహన
Trending Now