Thursday, April 3, 2025
spot_img
HomeArt‘హే గోవింద్’.. సేవే లక్ష్యంగా సంగీత కచేరీ

‘హే గోవింద్’.. సేవే లక్ష్యంగా సంగీత కచేరీ

ఆర్ట్ టైమ్స్, జూలై 29: సంగీత కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో నిర్వహించిన “హే గోవింద్” సంగీత కచేరీ సంగీత ప్రియులను విశేషంగా అలరించింది. శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరిస్తూ సాగిన ఈ దివ్య కచేరీ ఆధ్యాత్మిక పరిమళలాలను వెదజల్లింది. సేవే లక్ష్యంగా సంగీత సుస్వరాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తోన్న ‘ఎయిమ్ ఫర్ సేవ’ సంస్థ ఈ కచేరీని ఏర్పాటుచేసింది. సంగీతకారులు జయతీర్థ మేవుండి, ప్రవీణ్ గోద్కిండి తమ సంగీతం ద్వారా శ్రోతలను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్ళారు. శ్రీకృష్ణుని భజనలు, అభాంగ్ లు, కీర్తనలతో ఈ ఆధ్యాత్మిక కచేరీలో  చక్కని అనుభూతిని అందించింది. ఈ కచేరీలో జయతీర్థ్ (స్వరం), ప్రవీణ్ గోద్కిండి (వేణువు), నరేంద్ర ఎల్ నాయక్ (హార్మోనియం), సూర్యకాంత్ గోపాల్ సర్వే (సైడ్ రిథం), సుకద్ మాణిక్ ముండే (పఖావాజ్), యశ్వంత్ వైష్ణవ్ (తబల) పాల్గొన్నారు. కాగా, ‘ఎయిమ్ ఫర్ సేవ’ సంస్థని 2000లో పూజ్యశ్రీ స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. ఇది జాతీయ స్థాయి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular