ఆర్ట్ టైమ్స్, జూన్ 23 : భారతీయ టైర్ల తయారీ పరిశ్రమ జేకే టైర్ & ఇండస్ట్రీస్ చెన్నై ప్లాంట్ కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సస్టైనబిలిటీ & కార్బన్ సర్టిఫికేషన్ (ISCC) ప్లస్ సర్టిఫికేషన్ లభించింది. తద్వారా ఈ గుర్తింపు పొందిన దేశంలోనే మొట్టమొదటి టైర్ల తయారీసంస్థగా నిలిచింది. ఉత్పాదక రంగంలో స్థిరత్వం, పర్యావరణ పరిరక్షణ పట్ల తమకున్న నిబద్ధతకు ఇది తార్కాణమని జేకే టైర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రఘుపతి సింఘానియా పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ISCC ప్లస్ సర్టిఫికేషన్‌ను సాధించడానికి ముడి పదార్థాలను గుర్తించడం, పర్యావరణ నిబంధనలకు కట్టుబడి ఉండటం, పర్యావరణ వ్యవస్థల సంరక్షణ, కార్మిక, మానవ హక్కులను సమర్థించడం, అలాగే స్థిరమైన ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం వంటివి ప్రధాన కారణమని చెప్పారు. ఈ గుర్తింపు జేకే టైర్ సంస్థకి ఒక ముఖ్యమైన మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ఇక 2050 నాటికి JK టైర్ ను కార్బన్-న్యూట్రల్ బ్రాండ్‌గా మార్చాలని, ఇందులో భాగంగా 2030 నాటికి కార్బన్ తీవ్రతను 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, జేకే టైర్ చెన్నై ప్లాంట్ 2021లో జీరో-లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీగా గుర్తింపు పొందింది. 2020లో ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో “నేషనల్ ఎనర్జీ లీడర్” బిరుదును కూడా దక్కించుకుంది.
జేకే టైర్ చెన్నై ప్లాంట్‌కి ISCC ప్లస్ సర్టిఫికేషన్
Trending Now