ఆర్ట్ టైమ్స్, జూన్ 23 : ఫోటోగ్రఫీ రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఫోటోగ్రఫీలో సరికొత్త ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అందించే విధంగా తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ, సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ సంయక్త ఆధ్వర్యములో ఆరు నెలల ఉచిత డిప్లొమా కోర్సును నిర్వహిస్తున్నాయి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ రంగాల్లో ఈ కోర్సును అందిస్తున్నారు. ఫోటోగ్రఫీ అభిరుచి గలవారు, ఈ వృత్తిలో కొనసాగాలనుకునే వారికి ప్రాథమిక ఫోటోగ్రఫీతో పాటు పిక్టోరియల్ షూటింగ్ నైపుణ్యాలను, అధునాతన సాంకేతికతలు, కంపొజిషన్, లైటింగ్, ఫ్రేమింగ్, పోసింగ్ లలో ఫోటోగ్రఫీ నిపుణులచే శిక్షణ ఇస్తారు. కోర్సు తరగతులు ఆగస్టు 16న ప్రారంభమవుతాయి. ఆసక్తి గలవారు 8008021075, 7095692175 ఫోన్ నంబర్లలో సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అలాగే https://sapindia.org/free-workshops/ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆఖరు తేదీ జూలై 30.
ఉచితంగా ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సు
Trending Now
RELATED ARTICLES